చంద్రబాబు ని టచ్ చేసే దమ్ముందా ….. ఫ్లూటు జింక ముందు ఊదు…బాబు ముందు కాదు
ఏపీ సీఎం , రాజకీయాలలో అపరచాణిక్యుడు ,దేశం లోనే రాజకీయంలో ఎక్కువ అనుభవం గల మన చంద్రబాబు వ్యూహాల ముందు ఎలాంటి వారైనా కూడా దిగదుడుపే . చంద్రబాబుకి రాజకీయం లో దాదాపుగా 40 ఏళ్ల కి పైగా అనుభవం ఉంది . ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా తనదైన రాజకీయ మార్క్ తో ఆ విషయాన్ని తన వైపు తిప్పుకునే బుద్ది బలం కలవాడు బాబు . ఇక పొతే చంద్రబాబు అధికారం లో ఉన్న , ప్రతిపక్షం లో ఉన్న తన హుందా తనాన్ని కొనసాగిస్తూ ,తనదైన రాజకీయం తో ఏపీ ని అభివృద్ధి పంథాలో పరుగులు పెట్టించాడు , తెలంగాణ లో ఐటీ క్యారిడార్ ఇంతలా ఎదగానికి మొదటగా బీజం వేసింది కూడా బాబు గారే .
ఇక పొతే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ఫైర్ బ్యాండ్ గా ఉన్న , టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి ఒక కేసు లో ఇరుక్కున్నాడు . అదే ఓటుకి నోటు కేసు . అందులో సీఎం బాబు గారి హస్తం కూడా ఉంది అని అప్పట్లో ఒక వార్త పెద్ద సంచలనమైంది . కానీ తరువాత ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు అని తేల్చిపడేసారు . ఆ కేసు పై రేవంత్ కొన్ని రోజులపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది . తరువాత తెలంగాణ లోని టీడీపీ పరిస్థితి దృష్ట్యా రేవంత్ టీడీపీ కి గుడ్ బై చెప్పి , కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు . ఇలా సాగుతున్న తరుణం లో శాసన సభ రద్దు అంటూ తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించాడు కెసిఆర్ . దీనితో ఈ సారి తెలంగాణ లో తెరాస ని ఎదుర్కొనడానికి ,విపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడాయి . కెసిఆర్ తనకు తిరుగులేదు అని అనుకుంటున్న ఈ సమయంలో మహాకూటమి అంటూ బాబు ,కాంగ్రెస్ కలిసి తెర పైకి రావడం తో కెసిఆర్ పక్కా ప్లాన్ తో మళ్ళీ నేతల కేసులు రీ ఓపెన్ చేస్తున్నాడని అర్థమౌతుంది .
అందులో భాగంగా నే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది . రేవంత్‌తో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక పొతే రేవంత్ ఇంట్లో సోదాలు నిర్వహించేది ఓటుకి నోటు కేసు గురించే అని తెలుస్తుంది . దీనితో మళ్ళీ బాబు కి కూడా మూడింది అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు . కానీ అపరచాణ్యుక్యుడు లాంటి బాబు ని టచ్ చేయాలి అంటే ఒక్క కెసిఆర్ కాదు కదా …..పది మంది కెసిఆర్ లు వచ్చినా ఏమి చేయలేరు . బాబు ని ఎదో చేయాలనీ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేసి ..చివరికి ఏమి చేయలేక ఆయనే పోయాడు . ఏది ఏమైనా కూడా చట్టానికి కట్టుబడి ఉండే చంద్రబాబు నమ్మే ఒకే ఒక సిద్దాంతం చట్టం తన పని తాను చేసుకుపోతుంది .
Comments
Post a Comment